మాజీ మంత్రి కేటీఆర్‌ వేసిన పిటిషన్‌‌‌‌ను విచారించేందుకు తెలంగాణ హైకోర్టు అంగీకరించింది

ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో ఏసీబీ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే

ఈ నేపథ్యంలో కేటీఆర్‌ఉన్నత న్యాయస్థానంలో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు

ఏసీబీ దర్యాప్తుపై కూడా స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టును కేటీఆర్ కోరారు

తెలంగాణ ఏసీబీ కేటీఆర్‌ను ప్రధాన నిందితుడి గా పేర్కొంటూ కేసు నమోదు చేసింది

ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ (సీఐయూ) డీఎస్పీ మాజిద్‌ అలీఖాన్‌ కేసు నమోదు చేశారు

పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను 

హెచ్‌ఎండీఏ అప్పటి చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డి లనూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది

ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు