మొదట ఓటర్ ఐడీ మొబైల్ ఫోన్ నంబర్‌తో లింక్ కావాలి. అలాగే డౌన్‌లోడింగ్ ప్రక్రియకు ముందే కైవైసీ పూర్తి చేయాలి. ఫిజికల్ ఐడీ కార్డును కూడా పక్కనే పెట్టుకోవాలి.
స్మార్ట్‌ఫోన్‌లో వెబ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్ళాలి. డౌన్‌లోడ్ ఈ-ఎపిక్ ఆప్షన్‌ను ట్యాప్ చేయాలి. వెబ్‌పేజీ టాప్‌లో ఉండే ఈ-ఎపిక్(E - EPIC) డౌన్‌లోడ్ బటన్‌ను హిట్ చేయాలి.
ఇప్పటికే యూజర్ అయితే లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి. లేకుంటే ఫోన్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి.
పోర్టల్‌లోకి వెళ్ళగానే డౌన్‌లోడ్ ఈ-ఎపిక్ లింక్‌ని ట్యాప్ చేయాలి. అక్కడ ఎపిక్ నంబర్‌ని ఎంటర్ చేయాలి. ఫిజికల్ ఓటర్ ఐడీపై పది డిజిట్స్‌తో ఆ నంబర్ ఉంటుంది.
మొబైల్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే వివరాలను నిర్ధారించుకోవాలి.
ఓటీపీని ఉపయోగించి డౌన్‌లోడ్ ఈ-ఎపిక్‌ను హిట్ చేయాలి. తద్వారా స్మార్ట్‌ఫోన్‌లోకి డిజిటల్ ఓటర్ ఐడీ డౌన్‌లోడ్ అవుతుంది.