అల్లూరి జిల్లా అనంతగిరి మండలం  పినకోట పంచాయతీలో రూ.5.5 కోట్లతో గుమ్మంతి-రాచకీలం రోడ్డు నిర్మించారు

ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ రోడ్డుకు శంకుస్థాపన చేసాక గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు

గంజాయి పండించే విషయంలో ఒకసారి ఆలోచించండి. మీకు ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపిస్తాం

మీరు గంజాయిని వదిలేవరకూ నేను మిమ్మల్ని వదలను అని పవన్‌ పేర్కొన్నారు

దశాబ్దకాలంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ప్రజల వెతలు చూసి ఆవేదన చెందా

నన్ను తిట్టారు..నా కుటుంబసభ్యుల గురించి అసభ్యంగా మాట్లాడారు 

ఈ రోజు మీ ఆశీర్వాదంతో ప్రభుత్వంలో భాగస్వామినయ్యాను అని పవన్‌కల్యాణ్‌ అన్నారు

రూ.105.33 కోట్లతో గిరిజన గ్రామాలకు రోడ్లు వేయించగలుగుతున్నా

ఈ సొమ్మును ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనో, కాకినాడ జిల్లాలోనో ఖర్చు చేయలేక కాదు

ఆదివాసీలకు డోలీ మోతలు ఉండకూడదనే వెచ్చిస్తున్నాం అని పవన్‌ పేర్కొన్నారు