చేయని తప్పునకు శిక్ష  అనుభవించానని చంద్రబాబు ఆవేదన  వ్యక్తం చేశారు

హిందూస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌ షిప్‌ సమ్మిట్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి 53 రోజులు వేధించారు

అయినా ఎక్కడా నిరాశకు గురికాలేదు, ధైర్యం కోల్పోలేదన్నారు

53 రోజుల జైలు జీవితం.. మరింత పట్టుదల పెరిగేలా చేసిందని,

ఆ పట్టుదలను ప్రజలకు సేవ చేయటానికి ఉపయోగిస్తున్నానని చంద్రబాబు చెప్పారు

సోషల్ మీడియాలో విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి, వ్యక్తిత్వ హననం జరుగుతోంది

సామాజిక మాధ్యమాల్లో వేధించే సైకోలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు

ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉండాలనేది లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది

మా కూటమి దీర్ఘకాలం కొనసాగుతుంది అని చంద్రబాబు అన్నారు