ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌ జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది

శాంతిపరిరక్షణ చర్యలపై చర్చ సందర్భంగా పాక్‌ చేసిన అసత్య ప్రచారాన్ని భారత్‌ తిప్పికొట్టింది

జమ్మూకశ్మీర్ ఇప్పుడూ, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే

జమ్మూకశ్మీర్ ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు

పాక్‌ తన అసత్య ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలి అని 

రాజ్యసభ ఎంపీ, భాజపా ప్రతినిధి సుధాంశు త్రివేది ఘాటుగా బదులిచ్చారు

గతంలోనూ పలుమార్లు ఐరాస వేదికగా భారత్‌ చేతిలో పాక్‌ భంగపడింది

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి,

ఆర్టికల్‌ 370 రద్దుపై మాట్లాడిన సంగతి తెలిసిందే