తూర్పు లద్దాఖ్‌లోని దెప్సాంగ్, డెమ్‌చోక్ నుంచి భారత్-చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం
ఈ నెల 28, 29 తేదీల్లోపు ఇది పూర్తి కావొచ్చని సైనిక వర్గాలు పేర్కొంటున్నాయి
నాలుగేళ్ల సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలుకుతూ రెండు దేశాలు వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ,
బలగాల ఉపసంహరణకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే
రష్యాలోని కజన్‌లో మోదీ, జిన్‌పింగ్ ఐదేళ్ల తర్వాత తొలిసారి ముఖాముఖి చర్చలు జరిపారు
ఈ భేటీలో సుస్థిర సంబంధాలను కొనసాగించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు
దెప్సాంగ్, డెమ్‌చోక్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయి, అక్కడ నిర్మించిన తాత్కాలిక నిర్మాణాల కూల్చివేత తర్వాత
ఇరు దేశాలు 2020, ఏప్రిల్‌కు ముందు ప్రకారం గస్తీ నిర్వహిస్తాయి
కాగా, 2020లో గల్వాన్ లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది
దాంతో ఇరుదేశాలు ఎల్ఏసీ వెంబడి భారీస్థాయిలో బలగాలను మోహరించాయి
Related Web Stories
సెంచరీ కొట్టిన హైడ్రా..
వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల మూడు పేజీల లేఖ
అమరావతికి రైల్వే లైన్
బంగ్లాదేశ్‌లో మరో యుద్ధం