భారతదేశం ఈ ఆగస్టు 15వ తేదీన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు సర్వసన్నద్ధమవుతోంది.
ప్రతి సంవత్సరం ప్రధాన మంత్రి ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగిస్తారు.
మొట్ట మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని 1906, ఆగస్టు 7న కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్ వద్ద ఎగురవేశారు.
మొదటి జాతీయ జెండా ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులతో కూడిన వందేమాతరం నినాదంతో ఉండేది. మత చిహ్నాలతో పాటు పైన 8 రోజా పువ్వులు ఉండేవి.
జర్మనీలో జరిగిన సోషలిస్ట్ ఇంటర్నేషనల్ సమ్మిట్‌లో మేడమ్ బికాజీ కామా జాతీయ జెండాను ఎగురవేశారు. విదేశీ గెడ్డపై జెండాను ఎగురవేసిన తొలి వ్యక్తి మేడమ్ బికాజీ
ప్రస్తుత జాతీయ జెండాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పింగళి వెంకయ్య రూపొందించారు.
2002కు ముందు వరకు స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు తప్ప జాతీయ జెండాను ఎగురవేసే స్వేచ్ఛ భారత పౌరులకు ఉండేది కాదు
2002లో ఫ్లాగ్ కోడ్‌లో సుప్రీం కోర్టు కొన్ని మార్పులు చేపట్టింది. అప్పట్నుంచి భారతీయ పౌరులు ఎప్పుడైనా ఫ్లాగ్ కోడ్‌ను అనుసరించి జాతీయ జెండాను ఎగురవేయవచ్చు.