హర్యానా ఫలితాల్లో ఆసక్తికర విషయాలు
హర్యానా ఎన్నికల ఫలితాలు సర్వే సంస్థల అంచనాలను తలకిందులు చేశాయి.
హర్యానాలో 90 సీట్లకు బీజేపీ 48 సీట్లలో విజయం సాధించింది.
హర్యానాలో కాంగ్రెస్ 37 సీట్లలో మాత్రమే గెలిచింది.
గర్హి సంప్లా కిలోయి కాంగ్రెస్ అభ్యర్థి భూపేంద్రసింగ్ హుడా అత్యధికంగా 71,465 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
బీజేపీ నుంచి అత్యధిక మెజార్టీని గురుగావ్ అభ్యర్థి ముఖేష్ శర్మ సాధించారు. 68,045 ఓట్ల తేడాతో గెలుపొందారు.
హర్యానా ఎన్నికల్లో అతి తక్కువ మెజార్టీతో గెలిచిన వ్యక్తిగా బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ అత్రి నిలిచారు.
దేవేందర్ చతర్ భుజ్ అత్రి ఉచన కలన్ నియోజకవర్గం నుంచి 32 ఓట్ల తేడాతో గెలుపొందారు.
అంబాలా కంటోన్మెంట్ నుంచి పోటీచేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి చిత్రా సర్వారా 52,581 ఓట్లు సాధించారు.
చిత్రా సర్వారా 52,581 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పర్వీందర్ పాల్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాల ఘోర పరాజయాన్ని చవిచూశారు.
ఉచన కలన్ నుంచి పోటీచేసిన ఆయన 7,950 ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచారు.
దుష్యంత్ దౌతాలా కంటే ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు అధిక ఓట్లు సాధించారు.
Related Web Stories
కనకదుర్గ అమ్మవారి సేవలో డిప్యూటీ సీఎం
ఆంధ్రప్రదేశ్‌కు బుల్లెట్ ట్రైన్.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2024: ఫలితాలు
ఖాతా తెరవని 'ఆప్'.. కాంగ్రెస్ ఓట్లకు గండి