హమాస్‌ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ ను ఇజ్రాయెల్ ద‌ళాలు మ‌ట్టుబెట్టాయి

 ఇజ్రాయెల్‌లో 2023 అక్టోబర్ ఏడో తేదీన 1,200 మందిని చంపిన సిన్వర్‌

ఏడాది పాటు అన్వేషణ తర్వాత ఇజ్రాయెల్ దళాలు సిన్వర్‌ను అంతమొందించాయి

 ``గాజా స్ట్రిప్‌లో జరిగిన దాడుల్లో సిన్వర్‌ను అంతమొందించిన దళాన్ని కలుసుకున్నాను`` అని

 ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్‌) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ కల్నల్ హెర్జి హలేవి ప్రకటించారు

గాజా శరణార్థి శిబిరాల్లో అత్యంత పేదరికం మధ్య పెరిగిన సిన్వర్

 గాజాలో హమాస్ గ్రూప్‌నకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగాడు

ఇజ్రాయెల్‌ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న

 12 మంది పాలస్తీనియన్లను చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు

 గాజా స్ట్రిప్‌కు ఉత్తరాన జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను ఐడీఎఫ్ చంపింది

ఆ ముగ్గురి లో సిన్వర్ ఉన్నాడని ఐడీఎఫ్ ధ్రువీకరించింది