రాజధాని అమరావతిపై జగన్ ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరలేపింది.
ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజులు ముందు భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ మేరుకు గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నోటిఫికేషన్ రద్దుతో రాజధాని మాస్టర్ ప్లాన్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. 21 రెవెన్యూ గ్రామాల్లో 625 ఎకరాల సేకరణ పరిధి నుంచి మినహాయింపు రానుంది.
భూసమీకరణ కోసం అప్పటి టీడీపీ సర్కార్ భూసేకరణ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. సేకరణ తుది దశకు వచ్చిన తరుణంలో ప్రభుత్వం మారింది.
వైసీపీ సర్కార్ రద్దు చేయడంపై మండిపడుతున్న అమరావతి ప్రాంత రైతులు. వైసీపీ ప్రభుత్వం రాదు అనే ఉద్దేశ్యంతోనే ఈ కుట్ర చేశారని రైతుల ఆరోపణ. దీనిపై హైకోర్ట్‌కు వెళ్ళాలని నిర్ణయం.