జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు 2024: ఫలితాలు

దశాబ్దం తర్వాత.. ఇంకా చెప్పాలంటే ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీకి ఓటరు పట్టం కట్టాడు.

ఒమర్ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు చేపడతారని ప్రకటించిన ఆయన తండ్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 48 స్థానాలు గెలుచుకుంది. 

బీజేపీ 29, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) 3, ఇతర పార్టీలు10 స్థానాలు గెలుచుకుంది.   

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు విడతలుగా.. సెప్టెంబర్18, 25.. అక్టోబర్ 01వ తేదీన జరిగాయి. 

ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన వెలువడ్డాయి. 

ఈ ఎన్నికల్లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. 

జమ్మూ కశ్మీర్‌లో హంగ్ ఏర్పడుతుందంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 

ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని కాశ్మీర్ ఓటరు.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న నేషనల్ కాన్ఫరెన్స్‌కు అనుకూలంగా ఓటు వేసి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.