కోర్టులోకి వెళ్తుండగా కవిత సంచలన కామెంట్స్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ముగిసింది.
దీంతో ఆమెను జూన్ 3న తీహార్ జైలు అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు.
అయితే సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై జూన్ 3న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిపారు.
కాగా కోర్టులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ నినాదాలు చేశారు.
అన్యాయంగా తనను అరెస్టు చేశారని, త్వరలోనే నిర్దోషిగా బయటకి వస్తానంటూ కవిత అన్నారు.
మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను కూడా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు.
Related Web Stories
ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. విజయావకాశాలు వారికే?
ఎన్టీఆర్కు కుటుంబ సభ్యుల నివాళి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
'మేడిగడ్డకు మరమ్మతులు చేసినా ఉంటుందనే గ్యారెంటీ లేదు'