రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చేయకుండా, అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
సీఎం రేవంత్ సర్కార్ రాజకీయాలను పక్కనబెట్టి.. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు.
రైతుల నుంచి ధాన్యాన్ని తరుగు లేకుండా, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం స్పందించకపోతే రైతన్నల తరఫున ప్రశ్నించడమే కాకుండా.. అవసరమైతే రోడ్డెక్కి.. పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని కేటీఆర్ హెచ్చరించారు.
రైతులకు రుణమాఫీ జరిగే వరకు, పంట బోనస్ వచ్చే వరకు, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు వదిలిపెట్టమని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని.. కాంగ్రెస్ సర్కార్ హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆగదని కేటీరామారావు పేర్కొన్నారు.