తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్లు చేశారు.
అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసిందంటూ విమర్శించారు.
కాంగ్రెస్ హామీలపై ఢిల్లీ బాబు రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గారెంటీ అన్న మోసగాళ్లకు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని కేటీఆర్ హెచ్చరించారు.
330రోజులు ముగిసింది, ఏడాది నిండడానికి 35 రోజులే మిగిలిందని అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు.
చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యాయని విమర్శించారు.
చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే అని ఆరోపించారు.
ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం.. ధర్నాలు, రాస్తారోకోలు తప్పా అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఏడాదికి 35 రోజులే మిగిలింది తులం బంగారం ఎక్కడని మా బంగారు తల్లులు నిలదీస్తున్నారని కేటీఆర్ అన్నారు.
Related Web Stories
హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ నమోదు
మన దేశంలో టాప్-8 ధనిక రాష్ట్రాలు ఏవో తెలుసా?
ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా
యూనివర్సిటీలను నూరు శాతం ప్రక్షాళన చేయాలి