విరిగిపడిన కొండచరియలు.. చూస్తే వణుకు పుట్టాల్సిందే..

అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి.

హున్లీ, అనినీ ప్రాంతంలో 313 నేషనల్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో హైవే కొట్టుకుపోయింది.

దిబాంగ్ వ్యాలీ జిల్లాకు, భారత్‌లోని ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి.

దిబాంగ్ వ్యాలీ చైనా, భూటాన్‌తో సరిహద్దులు పంచుకుంటుంది.

ఘటనపై సీఎం పెమా ఖండూ స్పందించారు. 

త్వరితగతిన మరమ్మతులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు.

వీడియో