అనేక దేశాలు తమ ఆవిర్భావానికి కారణమైన నేతలను కరెన్సీలపై ముద్రిస్తూ గౌరవిస్తుంటాయి.
భారతదేశంలో 26-01-1950 వరకూ బ్రిటిష్ పాలన నాటి పాత నోట్లే ఉపయోగించారు.
1950-1960 మధ్య నోట్లపై పులులు, జింకల వంటి జంతువుల ఫొటోలను ముద్రించారు.
అలాగే హిరకుడ్ డ్యామ్, ఆర్యభట్ట శాటిలైట్, బృహదీశ్వర ఆలయం వంటివి ముద్రించారు.
1969లో మహాత్మాగాంధీ శతజయంతి ఉత్సవాల వరకూ ఆయన చిత్రపటం కరెన్సీపై లేదు.
సేవాగ్రామ్ ఆశ్రమంలో గాంధీజీ కూర్చున్న ఫొటోను 1969లో తొలిసారిగా ముద్రించారు.
అయితే జనతాపార్టీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన 9ఏళ్ల తర్వాత 1987లో తిరిగి ముద్రించారు.
రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1987లో రూ.500 కరెన్సీ నోట్లపై గాంధీజీ ఫొటో ముద్రించింది.
1996లో గాంధీజీ సిరీస్‌తో వాటర్ మార్క్, సెక్యూరిటీ త్రెడ్ ఫీచర్లతో కొత్త నోట్లు ప్రారంభించారు.
అప్పట్నుంచే దేశానికి చెందిన అన్ని నోట్లపై గాంధీ చిత్రాలు శాశ్వతంగా ముద్రించడం మొదలైంది.
ఇటీవలి కాలంలో గాంధీ స్థానంలో ఇతరుల ఫొటోలు ముద్రించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, అంబేడ్కర్ ఫొటోలు ముద్రించాలని డిమాండ్లు వస్తున్నాయి.
Related Web Stories
అక్టోబర్ 2: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి
ఏపీ కీలక హైకోర్టులో నటి జత్వాని కేసులో పిటిషన్ల విచారణ
హైడ్రా అంటే ఏంటీ.. ఏం చేస్తోంది
దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రాలు ఇవే!