తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.

కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

రేవంత్ రెడ్డి స్థానంలో మహేష్‌ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరిస్తారు.

2021 జూన్ 28 నుంచి మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

ఈ ఏడాది జనవరి 22న మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ ద్వారా మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.

1990లో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు.

1994 అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి సమీప ప్రత్యర్థి మండవ వెంకటేశ్వరరావు చేతిలో ఓటమి చెందారు.

2013 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు.

పీసీసీ కార్యదర్శిగా,  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.