నారాయణ్‌పుర్ జిల్లాలోని అటవీ
ప్రాంతంలో భద్రతా సిబ్బంది,
మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
జరిగాయి
ఈ ఎన్‌కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు
యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పుర్, దంతెవాడ, జగదల్‌పూర్, కొండగావ్ జిల్లాల
భద్రతా బలగాలు బస్తర్ పరిధిలోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు
డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఆర్‌పీఎఫ్ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి
ఈ క్రమంలో దండకారణ్యంలో కూంబింగ్ చేస్తుండగా భద్రతాబలగాలపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు
తెల్లవారుజామున 3 గంటల నుంచి ఈ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి
ఇప్పటివరకు ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి
ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు
Related Web Stories
భోగాపురం విమానాశ్రయం 2026 కల్లా సిద్ధం
సిరియా నుంచి తిరిగి వస్తున్న భారతీయులు
సిరియాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్
బ్యాగులతో కాంగ్రెస్ నేతలు వినూత్న నిరసన