తెలంగాణ శాసనసభ సమావేశంలో  మన్మోహన్‌ సింగ్‌కు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు

సీఎం రేవంత్‌రెడ్డి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు

మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది

2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది

ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఏర్పడింది

2004-14 మధ్య ప్రధానిగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు

ఉపాధిహామీ, ఆర్టీఐ, ఎన్‌హెచ్‌ఆర్‌ఎంను ప్రారంభించారు

ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఈ సభ తీర్మానం చేస్తోంది

ప్రధాని సహా అనేక హోదాల్లో ఉన్నా నిరాడంబరంగా జీవించారు

మన్మోహన్‌ సింగ్‌ నీతి, నిజాయతీ, నిబద్ధత కలిగిన నేత అని రేవంత్‌రెడ్డి అన్నారు

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్‌ సింగ్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం అని రేవంత్‌రెడ్డి తెలిపారు