ఉత్తర్‌ప్రదేశ్‌లో పురానాపుర్‌ ప్రాంతంలో  భారీ ఎన్‌కౌంటర్ జరిగింది

యూపీ పోలీసులు ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను మట్టుబెట్టారు

ఈ ఉగ్రవాదులు పంజాబ్‌ సరిహద్దుల్లో పోలీసు పోస్టులపై గ్రనేడ్ దాడులు జరిపిన ఘటన పై నిందితులుగా ఉన్నారు

యూపీలోని పీలీభీత్‌ జిల్లాలో వీరు ఉన్నట్టు తెలీడం తో పోలీసులు అప్రమత్తమయ్యారు

యూపీ, పంజాబ్‌ పోలీసులు ఆపరేషన్‌ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు

ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో పోలీసులకు వారికి మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది

కాల్పుల్లో నిందితులు గుర్వీందర్‌ సింగ్, వీరేంద్ర సింగ్‌, జసన్‌ప్రీత్ సింగ్‌ గాయపడ్డారు

వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి

నిందితులు పాక్‌ మద్దతున్న ఖలిస్థానీ జిందాబాద్‌ ఫోర్స్‌ సభ్యులని పంజాబ్ పోలీసులు పేర్కొన్నారు