బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై భారత్ తీవ్రంగా
స్పందించింది
దేశంలోని అల్పసంఖ్యాకులను రక్షిస్తామని తాత్కాలిక ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని స్పష్టం చేసింది
విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పార్లమెంటులో మాట్లాడుతూ
మైనారిటీల సహా పౌరులు ప్రాణాలను, స్వేచ్ఛను కాపాడే బాధ్యత ఢాకాదేనని తెలిపారు
ఢాకాలోని భారత హై కమిషన్ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని వెల్లడించారు
బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన దుర్గాపూజా వేడుకల్లో ఆలయాలు, పూజ మండపాలపై దాడులు జరిగాయి
దుర్గాపూజా వేడుకలు శాంతియుతంగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని జైశంకర్ పేర్కొన్నారు
చిన్మయ్ కృష్ణదాస్‌కు సంబంధించిన కేసులో పారదర్శకంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు
విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు
Related Web Stories
ఈవీఎంల వినియోగంలో అవకతవకలు చోటుచేసుకున్నాయి
ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరు
కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్‌గా మార్చారు
గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్