ఖైదీలకు మటన్ బిర్యానీ
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
జైల్లో ఉన్న ఖైదీలకు పశ్చిమ బెంగాల్ సర్కార్ దసరా సందర్భంగా ఈ శుభవార్త చెప్పింది.
దాదాపు 28 వేల మంది ఖైదీలకు ఈ దసరాకు పసందైన వంటకాలతో భోజనం అందించనున్నట్లు జైలు అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగానే చికెన్, మటన్, చేపలు సహా అన్నిరకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను లంచ్, డిన్నర్ మెనూలో చేర్చనున్నట్లు వెల్లడించారు.
ఖైదీల్లో సత్ర్పవర్తన తీసుకువచ్చేందుకు దుర్గా పూజల వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు.
ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్లల్లో ఈ వంటకాలను వడ్డించనున్నారు.
మెనూలో మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, బసంతి పులావ్, చేప తలతో కూడిన మలబార్ బచ్చలికూర, పప్పు తదితర వంటకాలు వడ్డించనున్నారు.
లూచీ చోలార్ దాల్, పాయేష్, చికెన్ కర్రీ, మాచర్ మాతా దియే పుయ్ షక్, పొటోల్ చింగ్రీ, మటన్ బిర్యానీ విత్ రైతా, మాచెర్ మాతా దియే దాల్, ఆలు, బసంతి పులావ్ అందిస్తారు.
ఈ ఏడాది దుర్గాపూజ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతీ ఏడాది మంచి ఆహారాన్ని అందిస్తామని జైలు అధికారులు వెల్లడించారు.
షష్టి నుంచి దశమి వరకు లంచ్, డిన్నర్ మెనూ అమల్లో ఉంటుందని జైలు అధికారులు పేర్కొన్నారు.
ఈ వంటకాలను ఖైదీలతో పాటు రిమాండ్ ఖైదీలకు కూడా అందిస్తారు.
Related Web Stories
హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల
టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
హర్ష సాయికి లుక్ అవుట్ నోటీసులు జారీ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు