78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు యావత్ భారతదేశం ముస్తాబైంది.

 ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వాతంత్ర్య దినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు.

మువ్వన్నెల ప‌తాకంలా క‌లిసి మెలిసి ఉందామని పిలుపునిచ్చారు.

స‌మ‌ర‌యోధుల త్యాగఫ‌లం మ‌న స్వేచ్ఛా స్వాతంత్య్రాలని చెప్పారు.

 ఆనందాలు నిండుగా సాగే జెండా పండ‌గ మ‌న దేశ స‌మ‌త‌, మ‌మ‌త‌ల‌కు నిద‌ర్శనమని వ్యాఖ్యానించారు.

దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమాల‌కు పాటుప‌డి స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుదామని చెప్పుకొచ్చారు. 

శాంతి, సామ‌ర‌స్యాల‌తో మెలుగుతూ మువ్వన్నెల ప‌తాకంలా క‌లిసిమెలిసి ఉందామని పేర్కొన్నారు.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగరేద్దామని పిలుపునిచ్చారు.