ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు

బీజేపీ, శివసేన, ఎన్సీపీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ మహరాజ్‌ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు

జాతీయ భావం, ప్రాంతీయ తత్వం మా పార్టీల సిద్ధాంతం అని అన్నారు

బాలా సాహెబ్‌ ఠాక్రే నుంచి తాను ఎంతో నేర్చుకున్నాను

శివసేన-జనసేన సనాతనాన్ని రక్షించడానికే ఆవిర్భవించాయి అన్నారు

ధైర్యం, పౌరుషంతో కూడిన భారత్‌ను బాలాసాహెబ్‌ కోరుకున్నారని గుర్తుచేశారు

అయోధ్య రామమందిరాన్ని నిర్మించి చూపించిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అంటూ ప్రశంసలు కురిపించారు

దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం..ఇప్పుడు దేశాన్ని రక్షించుకోవడం మీ చేతిలో ఉంది

మనం అందరం బాధ్యత గల పౌరులం.. ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు పవన్‌ కల్యాణ్‌