దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ స్థానాలు,  రెండు లోక్‌సభ స్థానాలకు ఉప  ఎన్నికలు జరిగాయి

అనేక రాష్ట్రాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగించింది

అస్సాంలో ఐదింటినీ, బిహార్‌లో నాలుగు స్థానాలను ఎన్డీయే గెలుచుకుంది

ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌లలో ఉన్న ఒక్కో స్థానంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు

ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం తొమ్మిది స్థానాలకు ఉపఎన్నిక జరిగింది

బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించగా సమాజ్‌వాదీ పార్టీ రెండు, ఆర్‌ఎల్‌డీ ఒక చోట విజయం సాధించాయి

ఉత్తరాఖండ్‌లో ఒక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో  బీజేపీ గెలుపొందింది

రాజస్థాన్‌లో ఏడు స్థానాలకు గాను ఐదు చోట్ల భాజపా విజయం సాధించింది

దౌసాలో కాంగ్రెస్‌ అభ్యర్థి, చొరాసీలో భారత్‌ ఆదివాసీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు

పంజాబ్‌లో నాలుగు స్థానాలలో మూడు చోట్ల ఆమ్‌ఆద్మీ పార్టీ , కాంగ్రెస్‌ ఒకచోట గెలుపొందాయి

కేరళలో రెండు స్థానాలకు ఎన్నిక జరగగా పాలక్కాడ్‌లో కాంగ్రెస్‌, చెలక్కరలో సీపీఎం అభ్యర్థులు గెలుపొందారు