వామ్మో.. ఈ దేశాలు యుద్ధంలోకి దిగితే.. భారీ నష్టం తప్పదు..

అత్యధిక అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశం అమెరికా. అమెరికా వద్ద దాదాపు 5,748 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. 

సోవియట్ యూనియన్‌గా ఉన్నప్పటి నుంచి రష్యా అణ్వాయుధాలను కలిగి ఉంది. రష్యా వద్ద 5,580 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. 

చైనా క్రమంగా తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటోంది. ప్రస్తుతం చైనా వద్ద 500 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. 

భూమి, సముద్రం ద్వారా ప్రయోగించగలిగే అణ్వాయుధాలు ఫ్రాన్స్ వద్ద ఉన్నాయి. ఫ్రాన్స్ దగ్గర 290 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. 

బ్రిటన్ తన జాతీయ రక్షణ ప్రణాళికలో భాగంగా అణ్వాయుధాలను కలిగి ఉంది. బ్రిటన్ వద్ద 225 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. 

ఏ దేశం పై అయినా మొదట ప్రయోగించకూడదనేది భారత న్యూక్లియర్ పాలసీ. ఇండియా వద్ద 172 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. 

వ్యూహాత్మక రక్షణను మెరుగుపరుచుకోవడం కోసం పాకిస్తాన్ అణ్వాయుధాలను భద్రపరుస్తోంది. పాక్ వద్ద 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. 

ఇజ్రాయెల్ దగ్గర ప్రస్తుతం 90 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. 

ఉత్తర కొరియా తరచుగా అణు పరీక్షలు నిర్వహించి ఇతర దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. నార్త్ కొరియా దగ్గర 50 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి.