ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని  ప్రధాని మోదీ పేర్కొన్నారు

 ‘ది రైజింగ్‌ రాజస్థాన్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌  సమ్మిట్‌ 2024’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు

రిఫార్మ్‌, పెర్ఫార్మ్‌, ట్రాన్సఫార్మ్‌ మంత్రంగా భారత్‌ చేసిన అభివృద్ధి ప్రతి రంగంలోను కనిపిస్తోంది

మరికొన్నేళ్లపాటు మనం అత్యంత యువ దేశంగా ఉండనున్నాం

స్వాతంత్ర్యం తర్వాత ప్రభుత్వాలు రాజస్థాన్‌ అభివృద్ధి, సంస్కృతిని నిర్లక్ష్యం చేశాయి

అందుకే ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది అని మోదీ అన్నారు

‘వికాస్‌ భీ- విరాసత్‌ భీ’ మంత్రంగా మా ప్రభుత్వం పనిచేస్తోంది

రాజస్థాన్‌లోని పరిస్థితులు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయి

భారత్‌లో అతిపెద్ద సోలార్‌ పార్కుల్లో చాలావరకు ఇక్కడే ఏర్పాటవుతున్నాయి

రెండు ఎయిర్‌ కార్గో కాంప్లెక్సులు కూడా ఏర్పాటుచేశాం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు