దాదాపు ఐదున్నర దశాబ్దాలుగా  సాగుతున్న అసద్‌ కుటుంబ పాలనకు తెర

పశ్చిమాసియా దేశమైన సిరియాలో నిరంకుశ పాలనకు ఎట్టకేలకు తెరపడింది

తిరుగుబాటుదారులు విజృంభించి రాజధాని డమాస్కస్‌లోకి ప్రవేశించారు 

దేశాధ్యక్షుడు బషర్‌ అల్‌-అసద్‌ తెల్లవారుజామున దేశం విడిచి వెళ్లిపోయారు

ఆయన ప్రభుత్వం కూలిపోయి,సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్లింది

తాజా పరిణామంతో డమాస్కస్‌ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు

మరోవైపు- అసద్‌ తన కుటుంబంతో సహా రష్యాకు శరణార్థిగా చేరుకున్నారు

అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాకే అసద్‌ సిరియా వీడారని మాస్కో తెలిపింది

విదేశీ జోక్యం లేకుండా సిరియన్లే తమ దేశ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఇరాన్‌ సూచించింది