రాహుల్‌ని రాజ మాంత్రికుడితో పోల్చిన మోదీ
పేదరికాన్ని ఒక్క చిటికతో నిర్మూలిస్తామన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు.
చిటికలో పేదరికం నిర్మూలిస్తామంటున్నారంటే ఆయన రాజ మాంత్రికుడేనని ఎగతాళి చేశారు. దేశ ప్రజలు ఆయన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదని అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని పిపారియా పట్టణంలో జరిగిన ర్యాలీలో మోదీ ఆదివారం ప్రసంగించారు.
రాజ మాంత్రికుడు ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి పోయారు? 2014కి ముందు రిమోట్ కంట్రోల్‌తో ప్రభుత్వాన్ని నడిపించారు. ఇప్పుడు ఇన్‌స్టంట్‌గా మంత్రం దొరికింది.
ఇలాంటి ప్రకటనలు చేసి కాంగ్రెస్ నేతలు నవ్వులపావుతన్నారు. ఇది పేదల జోక్.
అంబేడ్కర్‌ని కాంగ్రెస్ ఎప్పుడూ అవమానించేదని.. కానీ.. బీజేపీ ఆయన్ని గౌరవించిందన్నారు. బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు.
ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్ నినాదం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని.. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
Related Web Stories
సీఎం జగన్‌పై మండిపడ్డ షర్మిల
మోదీ రోడ్‌షోలో జనం రియాక్షన్ చూడాల్సిందే..!
ప్రధాని మోదీ, కేసీఆర్‌పై విరుచుకుపడిన రాహుల్
సీఎం జగన్‌పై ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు