ప్రధాని మోదీ ప్రజాగళం స్పీచ్‌లో ముఖ్యాంశాలు

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ చాలాకాలం నుంచి ఏపీ వికాసం కోసం రేయింబవళ్లు పని చేస్తున్నారు.

ఎన్డీఏ లక్ష్యం వికసిత్ భారత్, వికసిత్ ఏపీ.. అభివృద్ది చెందే దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు 400 సీట్లు అవసరం

అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారు.. వైసీపీ ప్రభుత్వ అవినీతి వల్లే ఏపీ అభివృద్ధి చెందలేదు.

ఏపీ ప్రజలు రెండు సంకల్పాలు తీసుకోవాలి.. ఎన్డీఏ సర్కారును మూడోసారి ఏర్పాటు చేయడం, ఏపీలో అవినీతి సర్కారుకు చరమగీతం పాడడం

ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటే.. రెండూ కుటుంబ పార్టీలే.. కాంగ్రెస్, వైసీపీ మధ్య రహస్య స్నేహం ఉంది.. వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు

సీనియర్ ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి.. రైతులు, పేదల కోసం ఎన్టీఆర్ పోరాడారు.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నాణెం విడుదల చేశాం

పీవీ నరసింహారావును కాంగ్రెస్ అవమానించింది.. ఎన్డీఏ ప్రభుత్వం ఆయనను గౌరవించింది.. పీవీకి భారత రత్న ఇచ్చాం

కాంగ్రెస్ మిత్రపక్షాలను వాడుకుని వదిలేస్తే.. ఎన్డీఏలో అందరిని కలుపుకుని వెళ్తున్నాం.. ఎన్నికలకు ముందే విబేధాలు బయటపడ్డాయి

రైతుల కోసం కేంద్రం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది.. దేశ ప్రజల్లో కోట్లాది మందిని పేదరికం నుంచి బయటపడేశాం