భారత రాజ్యాంగం 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్‌సభలో  ప్రత్యేక చర్చ జరుగుతోంది

విపక్షాల తరఫున కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా చర్చను ప్రారంభించారు

భాజపా ఎల్లప్పుడూ గతం గురించే మాట్లాడుతుంది. కానీ, దేశ ప్రగతి కోసం ఇప్పుడేం చేస్తున్నారో వారు మాట్లాడాలి

దేశంలో జరిగే అన్నిటికీ నెహ్రూనే కారణమా? నెహ్రూ పేరును, ఆయన ప్రసంగాలను పుస్తకాల నుంచి తొలగించగలరేమో..

కానీ, స్వతంత్ర్య పోరాటంలో, జాతి నిర్మాణంలో ఆయన పాత్రను చెరిపేయలేరు అని ప్రియాంక కౌంటర్‌ ఇచ్చారు..

ఇది సంవిధాన్‌.. సంఘ్‌ రూల్‌ బుక్‌ కాదు అని కాంగ్రెస్‌ ఎంపీ దుయ్యబట్టారు

రాజ్యాంగం దేశ ప్రజలను కాపాడే ‘సురక్షా కవచం’

లేట్రల్‌ ఎంట్రీ, ప్రైవేటీకరణ వంటి చర్యలతో రిజర్వేషన్లను బలహీనపర్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది

లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీ వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చాలని ఎన్డీయే భావించింది

అది జరగకపోవడంతో ఆ ప్రతిపాదనలపై వెనక్కి తగ్గింది అని ప్రియాంక అన్నారు