ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష 30 వేలు వేస్తాం: రాహుల్ గాంధీ

కేంద్రంలో అధికారంలోకి రాగానే ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష 30 వేలు వేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌, అలంపూర్‌ కాంగ్రెస్‌ జనజాతర సభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..

ఇంటి పనుల్లో మహిళల శ్రమకు గుర్తుగానే ఆర్థిక సాయం అందజేసే ఆలోచన వచ్చింది. ఈ పథకంతో దేశంలో పేద మహిళలను లక్షాధికారుల్ని చేస్తాం.

రాజ్యాంగం రద్దుకు ఎన్డీయే కుట్ర చేస్తోంది. రక్షించే లక్ష్యాన్ని ఇండియా కూటమి తీసుకుంది. అందుకే ఇవి ఎన్నికలు కావు.. 2 సమూహాల మధ్య జరిగే యుద్ధం

మోదీ పనిచేసింది 22 మంది ధనికుల కోసమే. వారికి రూ.16 లక్షల కోట్లు మాఫీ చేశారు.

రైతులకు రుణమాఫీ చేస్తాం. ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పిస్తాం. నిరుద్యోగుల కోసం ‘పెహలీ నౌకరీ పక్కా’ పేరుతో పథకం తెచ్చి ఏడాది అప్రెంటిస్‌షిప్‌ ఏర్పాటు చేస్తాం.

రిజర్వేషన్లపై పరిమితినీ ఎత్తేస్తాం.. 50శాతానికి మించి ఇస్తాం

తెలంగాణలోని పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న రాహుల్ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.