సన్నగిల్లుతున్న బెయిల్ ఆశలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశాలు కనిపించట్లేదు.
సీబీఐ ప్రత్యేక కోర్టు రౌస్ అవెన్యూలో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఆమె బెయిల్ పిటిషన్‌ని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ రెండింటినీ కోర్టు కొట్టేసింది.
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కవిత బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ బెయిల్ కోసం కోర్టును సంప్రదించారు.
మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్-45 ప్రకారం బెయిల్ అర్హత ఉందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
విచారించిన రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ఆమె బెయిల్ పిటిషన్‌ని తిరస్కరిస్తూ తీర్పు వెలువరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 2024 మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసి.. తీహార్ జైలుకు తరలించింది. అనంతరం సీబీఐ కూడా అరెస్ట్ చేసింది.
Related Web Stories
ప్రతి మహిళ ఖాతాలో రూ.లక్ష 30 వేలు వేస్తాం: రాహుల్ గాంధీ
తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
ఫోన్ ట్యాపింగ్.. కేసీఆర్ కోసమే!
మన తెలుగువారే రిచ్చెస్ట్ ఎంపీ అభ్యర్థులు..