అఫ్గాన్‌పై పాక్‌ వైమానిక దాడులు  చేసింది

తాజాగా పాక్‌ సరిహద్దువైపుగా 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు కదులుతున్నారని మీడియా కథనాలు వచ్చాయి 

కాబుల్‌, కాందహార్ నుంచి పాక్‌కు చెందిన ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ను కలిపే బోర్డర్‌వైపు వెళ్తున్నారని పేర్కొన్నాయి

అఫ్గాన్‌ లోని తూర్పు పక్తికా ప్రావిన్స్‌లోని నాలుగు గ్రామాలు లక్ష్యంగా పాక్‌ వైమానిక దాడులు చేసింది

ఈ ఘటన లో 46 మంది చనిపోయారు

తాలిబన్‌ ఈ దాడులను అనాగరిక చర్యగా పేర్కొంది

వీటికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తాలిబన్‌ హెచ్చరించింది

పక్తికా రాష్ట్రంలో మిలిటెంట్లకు శిక్షణ అందిస్తున్న శిబిరాన్ని ధ్వంసం చేశామని 

తిరుగుబాటుదారుల్ని హతమార్చే లక్ష్యంతో ఈ దాడులు జరిపామని పాకిస్థాన్‌ భద్రతా వర్గాలు వెల్లడించాయి

తాను పెంచి పోషించిన తాలిబన్లే ఇప్పుడు పాక్‌ కు వ్యతిరేకంగా మారుతున్నారు