ఏపీ శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తొలిసారిగా మాట్లాడారు

జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కల్యాణ్ మాట్లాడారు

సచివాలయ భవనాలకు,ఇతర కార్యాలయలకు రూ.101 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు

రంగులు వేయడానికి రూ.49 కోట్లు అయ్యాయని అన్నారు

వాటిని తొలగించి తిరిగి రంగులు వేయడానికి రూ.52 కోట్లకు ఖర్చు అయిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు

గత ప్రభుత్వం పంచాయతీలకు రాష్ట్ర వాటా ఇవ్వలేదు

పంచాయతీలను అనేక కారణాలతో నిర్వీర్యం చేశారు

కేంద్రం కూడా నమ్మకం పోయి నిధులు ఆపేసింది

అన్ని వ్యవస్థల్లో, పథకాల్లో ఛాలెంజ్‌లు ఉన్నాయి

పంచాయతీకి నిధులు సమకూర్చే సవాల్‌ను స్వీకరించి ముందుకు సాగుతాం అని పవన్ పేర్కొన్నారు