మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  ‘మహాయుతి’ కూటమి అద్భుత విజయం సాధించింది

అఖండ విజయంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు

ప్రజలంతా నరేంద్ర మోదీ వెంటే నిలిచారనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు

భారీ విజయం సాధించడంలో సహకరించిన మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు

అనేక తప్పుడు ఆరోపణలు, బూటకపు కథనాలను ప్రచారం చేయడం, 

మతం ఆధారంగా ఓటర్లను వేరు చేయడం వంటి విపక్ష పార్టీల ప్రయత్నాలను జనం విఫలం చేశారన్నారు

తమ కూటమి విజయంపై ముంబయిలో విలేకర్లతో మాట్లాడారు 

ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎలాంటి వివాదం లేదని..

తదుపరి సీఎం ఎవరనే విషయంపై ‘మహాయుతి’ నేతలు నిర్ణయిస్తారని ఫడణవీస్‌ స్పష్టం చేశారు

సీఎం ఏక్‌నాథ్‌ శిందే సారథ్యంలోని పార్టీనే బాలాసాహెబ్‌ ఠాక్రే నిజమైన శివసేన అని ప్రజలే చూపించారన్నారు