పశ్చిమబెంగాల్‌ను ఆక్రమించగలమని బంగ్లాదేశ్‌కు చెందిన రాజకీయ  నాయకులు వ్యాఖ్యలు చేసారు 

బెంగాల్, బిహార్, ఒడిశాలు కూడా తమ దేశంలో అంతర్భాగమని అన్నారు

ఆ వ్యాఖ్యలు పై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు

మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బంగ్లా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని మండిపడ్డారు

మీరు బెంగాల్, బిహార్, ఒడిశాలను ఆక్రమిస్తుంటే మేం లాలీపాప్‌లు తింటూ కూర్చుంటామా?

ఆ ఆలోచన కూడా చేయకండి అని హెచ్చరించారు

భారత్‌ వైపు చూసే దమ్ము ఎవరికీ లేదని మమత తెలిపారు

మేం మత ఘర్షణలను కోరుకోవడం లేదు

హిందువులు, ముస్లింలు, అన్ని మతాల వ్యక్తుల్లోనూ ఒకే రక్తం ప్రవహిస్తుంది

మనమంతా భారతీయులం అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు