యావత్ ప్రపంచం భారతదేశ రాజకీయ సుస్థిరతని గమనిస్తోందని ఎస్ జైశంకర్ అన్నారు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు

ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మాములు విషయం కాదని తెలిపారు

7-8 శాతం వృద్ధి రేటును సాధించడంలో ఇతర దేశాలు చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నందున

మొత్తం ప్రపంచం దృష్టి భారతదేశ ఆర్థికాభివృద్ధిపైనే ఉందని జైశంకర్ తెలిపారు

చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాయని

దేశంలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు

అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ

డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనలో అమెరికా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు

ఆయన ఎన్నికతో యూఎస్‌ ఆర్థిక, తయారీ రంగాల్లో మరిన్ని ప్రయోజాలు పొందుతుందని తెలిపారు