మహారాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి తీరుపై ఎన్సీపీ అధినేత  శరద్ పవార్ విమర్శలు గుప్పించారు

దేశ పగ్గాలు తమ చేతుల్లో ఉన్నవారు ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను పట్టించుకోవడం లేదన్నారు

వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని చట్టాలు రూపొందించుకుంటున్నారని ఆరోపించారు

ఈవీఎంలలో జరుగుతున్న అవకతవకల విషయంలో దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నా

విపక్షాలు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నా కేంద్రం తనకేమీ పట్టనట్టు

ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నా.. మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదని.. 

ఈవిధంగా వారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు

కొందరు నేతలు, మీడియా వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు

రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టిందని ఆరోపించారు

పార్లమెంటు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ ఇలా జరగలేదని వ్యాఖ్యానించారు