బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో  జరిగిన పేరెంట్స్‌- టీచర్స్‌ సమావేశానికి  సీఎం హాజరై కీలకోపన్యాసం చేశారు

చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదు,విద్యతోనే ఏదైనా సాధ్యమవుతుంది

మీ జీవితాలు మారాలంటే విద్యతోనే సాధ్యమని అని ముఖ్యమంత్రి విద్యార్థుల తల్లిదండ్రులకు ఉద్బోధించారు

రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో పెనుమార్పులకు నాంది పలుకుతామని చంద్రబాబు చెప్పారు

తల్లిదండ్రులంతా తమ పిల్లలు ఏం చదువుతున్నారు?ఏం చేస్తున్నారు?

ఇందుకోసం మీ పిల్లలు చదివే బడిలో ఉపాధ్యాయులతో మమేకమవ్వాలి

పొరపాటున పిల్లలు దారి తప్పినా వెంటనే సరిదిద్దుకునే అవకాశం అప్పుడే ఉంటుంది

తొలిసారిగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒకేరోజు 44 వేల పైచిలుకు పాఠశాలల్లో

మెగా పేరెంట్స్‌- టీచర్స్‌ సమావేశాలకు శ్రీకారం చుట్టింది అని చంద్రబాబు పేర్కొన్నారు

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ను అభినందించారు