నా గురించి మీరు అనుకుంటున్నట్టే  మీ గురించీ కింది స్థాయి నేతలూ అనుకుంటారు అని గుర్తెరగాలి

పని చేయని వారిని ఉపేక్షించేది లేదు అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు

నేను మారాను.. మీరూ మారాలి అంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఉద్దేశించి రేవంత్‌ చెప్పారు

నిరుటితో పోలిస్తే కొత్త ఏడాది తనలో మార్పు వచ్చిందని

గత ఏడాదికి భిన్నంగా తాను నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నాని అన్నారు

పార్టీ ఎమ్మెల్యేలూ కిందిస్థాయి నాయకులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపాలని సూచించారు

పార్టీ ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరి పనితీరుకు సంబంధించి

రిపోర్టు కార్డు తన దగ్గర ఉందని,ఎవరు ఏ మేరకు పనిచేస్తున్నారు..

ఎవరిని గుర్తించి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది తనకు తెలుసునన్నారు రేవంత్‌ రెడ్డి

తన పనితీరుపైనా రిపోర్టు కార్డును తెప్పించుకున్నానని అన్నారు