విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య చర్చ  జరిగింది

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం పవన్‌ తేల్చిచెప్పారు

ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రైవేటీకరణ చేయడం లేదని స్పష్టంగా చెప్పారని భరత్‌ అన్నారు

ప్రైవేటీకరణ వద్దని కేంద్రహోంమంత్రి అమిత్‌షాను కోరామని పవన్‌ చెప్పుకొచ్చారు

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణను ఆపింది తామేనని ఆయన అన్నారు

చర్చల్లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు

ప్రైవేటీకరణ వద్దంటూ సభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు

అచ్చెన్న మాట్లాడుతూ ప్రైవేటీకరణ అంశమే ఉత్పన్నం కానప్పుడు తీర్మానం ఎందుకని ప్రశ్నించారు