ఈ దేశాల్లో క్రిస్‌మస్ సెలబ్రేషన్స్‌పై నిషేధం.. 

మరో రెండ్రోజుల్లో క్రిస్‌మస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా దేశాలు సమాయత్తమవుతున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం క్రిస్‌మస్ సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉంటున్నాయి. 

కొన్ని దేశాలు క్రిస్‌మస్ సెలబ్రేషన్స్‌పై పూర్తి నిషేధం విధించాయి. మరికొన్ని దేశాలు బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించాయి. 

ఉత్తర కొరియా మత వైఖరుల కారణంగా అక్కడి ప్రజలెవరూ క్రిస్‌మస్ వేడుకలు చేసుకోకూడదు. 

తజికిస్తాన్‌లో క్రిస్‌మస్ ట్రీ పెట్టుకోవడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడంపై ఆంక్షలు ఉన్నాయి. 

తాలిబన్ పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్ ప్రజలు కూడా క్రిస్‌మస్ వేడుకలు చేసుకోకూడదు. 

సోమాలియా ప్రజలు క్రిస్‌మస్, న్యూ ఇయర్ వేడుకలకు పూర్తి దూరంగా ఉండాల్సిందే. 

లిబియా ప్రజలు కూడా క్రిస్‌మస్ వేడుకలు జరుపుకోకూడదని ప్రభుత్వం నిషేధం విధించింది.