కేసీఆర్, రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో  నైతిక విలువలు వదిలేశారని  మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు

గతంలో భారాస ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా అలాగే ఉందన్నారు

రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు

కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల మేర అప్పులు చేశారన్నారు

రేవంత్ ఏకంగా అప్పుల కోసం ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు

రైతు భరోసా రుణమాఫీ లేదు

పింఛన్లు పెంచుతామన్నారు ఒక్క రూపాయి పెంచలేదు,కొత్త పింఛన్లు ఇవ్వలేదు

రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు

హామీలన్నీ ఆయన గాలికొదిలేశారు

దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి భ్రష్టు పట్టించింది అని కిషన్‌రెడ్డి విమర్శించారు