సెంచరీ కొట్టిన హైడ్రా..
రాష్ట్రంలో చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా.
హైడ్రా ఏర్పాటు చేసి నేటికి
వంద రోజులు పూర్తి అయ్యింది.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది.
రాష్ట్ర చరిత్రలోనే వంద రోజుల వ్యవధిలో 300 అక్రమ నిర్మాణాల హైడ్రా నేలమట్టం చేసింది.
ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ను తీసుకువచ్చింది.
దీంతో జూలై 26 నుంచి కూల్చివేతలను మొదలుపెట్టింది హైడ్రా.
ఇప్పటి వరకు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను కూల్చివేసింది.
100 రోజుల్లో 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగింది.
జీహెచ్‌ఎంసీతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు మామూలుగా లేదు.
హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో దేశవ్యాప్తంగా హైడ్రా పేరు మారుమోగిపోయింది.
దీంతో పాటు సిటీలో వరద ముంపు సమస్య పరిష్కారం, ట్రాఫిక్ నియంత్రణ, చెట్ల సంరక్షణపైనా హైడ్రా ఫోకస్ చేయనుంది.
Related Web Stories
వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల మూడు పేజీల లేఖ
అమరావతికి రైల్వే లైన్
బంగ్లాదేశ్లో మరో యుద్ధం
బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ శాంతి సందేశం