అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడిపై
రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్
ప్రశంసలు కురిపించారు
కజకిస్థాన్‌లో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న రష్యా అధినేత మీడియాతో మాట్లాడారు
ఈ సందర్భంగా అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనలను గుర్తుచేసుకున్నారు
అమెరికా చరిత్రలోనే ఈసారి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నాయి
ఎన్నికల్లో ట్రంప్‌పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారు
ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించడం దిగ్భ్రాంతి కలిగించింది
ఒకటికంటే ఎక్కువసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరగడం విచారకరం అని
నా ఆలోచన ప్రకారం.. ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరు
అయితే ఆయన తెలివైన వ్యక్తి
ముప్పును అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారని విశ్వసిస్తున్నా అని పుతిన్ తెలిపారు
Related Web Stories
కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్‌గా మార్చారు
గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్
ప్రపంచమంతా మీ అవినీతి గురించి మాట్లాడుకోవడం చరిత్రే
మారిటైం హబ్‌గా ఏపీ