రేవంత్‌- అదానీ ఫొటో ముద్రించిన  టీషర్టులతో వెళ్లిన బీఆర్ఎస్ నేతలను  పోలీసులు అసెంబ్లీలోకి  అనుమతించలేదు

టీషర్టులతోనే లోపలికి వెళ్తామని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పడం తో ఉద్రిక్తత నెలకొంది

దాంతో బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్ద నిరసన కొనసాగించారు

భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు

కేటీఆర్‌, హరీశ్‌రావు, నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు

అంతకుముందు కేటీఆర్ మాట్లాడుతూ పార్లమెంట్‌కు కాంగ్రెస్‌ ఎంపీలు అదానీ ఫొటో ఉన్న టీషర్టులు ధరించి వెళ్లారన్నారు

అదానీ-రేవంత్‌ బంధాన్ని బయటపెడతాం 

పోలీసులను అడ్డుపెట్టుకొని సభకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు

పార్టీ దుర్మార్గ వైఖరికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతాం అని చెప్పారు