ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన  జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో  ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు

తాజా పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం

దాంతో తాజాగా జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్‌ జమిలి ఎన్నికల ముసాయిదా బిల్లు పై ఆమోదముద్ర వేసింది

13, 14 తేదీల్లో తప్పనిసరిగా సభకు హాజరు కావాలని ఎంపీలకు భాజపా, కాంగ్రెస్‌లు విప్‌ జారీ చేశాయి

పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో రూపొందించిన నివేదికను 

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ ఏడాది మార్చిలో అందించారు

అనంతరం కోవింద్‌ కమిటీ ఇచ్చిన సిఫార్సులకు కేంద్ర మంత్రివర్గం ఈ సెప్టెంబరులోనే పచ్చజెండా ఊపింది

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల ప్రతిపాదనలను 30 కి పైగా పార్టీలు సమర్థించగా..

కాంగ్రెస్‌ సహా 15 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి