సేవాకేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలి

మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు

కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవాకేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు

సీఎం తో పాటుమంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు

తేమశాతం నిర్ధరణ చేసే మిషన్ పనితనంపై ఆరా తీశారు

తేమ శాతం, ఇతరత్రా అంశాల్లో కచ్చితత్వం ఉండాలని ఆదేశించారు

సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడారు

గత ఏడాది కంటే ఈ ఏడాది పంట చాలా బాగా పండిందని

మిషన్ కోత వల్ల రూ. 5, 6 వేలు ఎకరానికి ఈ ఏడాది కలిసి వచ్చిందని రైతులు తెలిపారు