రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో  పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ  సీఎం చంద్రబాబు అన్నారు

రాష్ట్రాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతోనే కూటమిగా ఏర్పడి పోటీ చేశామన్నారు

93 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలవడం ఒక చరిత్ర అని చెప్పారు

మోదీ, పవన్‌, ప్రజలు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని దానిని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని చెప్పారు

గత ఐదేళ్లలో వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారని

వైసీపీ చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయి

ఐదేళ్లపాటు హింసా రాజకీయాలు, కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టారు

ఆడ బిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించం

మహిళలను కించపరిచేలా కూటమి నేతలెవరూ పోస్టులు పెట్టరు.. పెట్టించబోరు

ఒక వేళ అదే జరిగితే సొంతవాళ్లని కూడా చూడకుండా కఠినంగా వ్యవహరిస్తాం అని చంద్రబాబు అన్నారు